– తాజా మాజీ సర్పంచ్ అచ్చం గారి భాస్కర్
మర్కుక్ , ఆగస్టు 6
ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా మర్కుక్ మండల కేంద్రంలో జయశంకర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన తాజా మాజీ సర్పంచ్ అచ్చంగారి భాస్కర్. అనంతరం అచ్చంగారి భాస్కర్ మాట్లాడుతూ స్వర్గీయ ప్రొఫెసర్ జయశంకర్ కన్న కల ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం.అలాంటి మన రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తూ ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను నెరవేర్చేలా మనందరం కృషి చేయాలని మర్కుక్ తాజా మాజీ సర్పంచ్ భాస్కర్ అన్నారు.ఈ కార్యక్రమంలో ఏపీడి స్పెషల్ ఆఫీసర్ బాలకృష్ణ,ఎంపీడీవో అఫ్జల్ ఖాన్, పంచాయతీ సెక్రెటరీ శాంతి, శ్రీనివాస్ రెడ్డి, ప్రవీణ్ చారి, జితేందర్ రెడ్డి, ఆశ వర్కర్లు, సిఏలు,గ్రామ వివిధ పార్టీ నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
