సిద్దిపేట నవంబర్ 10: సిద్దిపేట గౌరవాన్ని ఎల్లలు దాటించిన నాయకున్ని మెజారిటీ లో మరింత ఎత్తు కు పెంచుదాం…
– సిద్దిపేట ప్రజలుగా మనమందరం గర్వ పడాలి.
– చిన్నకోడూరు మండలం లోని అనంతసాగర్ గ్రామం లో జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి హరీష్ రావు పక్షాన ఎన్నికల ప్రచారం నిర్వహించిన నాయకులు, పార్టీ శ్రేణులు…
సిద్దిపేట నియోజకవర్గం అభివృద్ధిలో దేశానికి ఆదర్శవంతంగా ఉందని జడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ తెలిపారు. హరీష్ రావును భారీ మెజార్టీతోటి గెలిపిస్తామని తెలియజేశారు. సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం అనంతసాగర్ గ్రామంలోని కారు ఓటు వేయాలని ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించినట్లు జడ్పీ చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ ఎంపీపీ మాణిక్య రెడ్డి తెలిపారు. అనంతసాగర్ ఆలయంలో ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారి దయ హరీష్ రావు పైన ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు .రాష్ట్రంలో గులాబీ జెండా ఎగరవేస్తామని తెలిపారు .పార్టీకి ఎంతో ఆదరణ ఉన్నట్లు తెలిపారు. అభివృద్ధిని చూసి ఓటు వేయాలని కోరారు. అత్యవసర సమయంలో ప్రజలు హైదరాబాద్ పోయె ఇబ్బందులు ఆరోగ్యరీత్యా తప్పినట్లు తెలిపారు.
సిద్దిపేట నియోజకవర్గం లో ఎ కార్యక్రమం తలపెట్టిన పూర్తిగా సక్సెస్ అవుతున్నట్లు తెలిపారు. గ్రామ గ్రామాన పార్టీకి మంచి ఆదరణ లభిస్తున్నట్లు తెలిపారు. ఆపద వస్తే నేనున్నానని ప్రజలకు అండగా హరీష్ రావు ఉంటారని తెలిపారు. హరీష్ రావు ఎక్కడ ఉన్న సిద్దిపేట నియోజకవర్గ ప్రజల పైన ప్రేమ ఎప్పుడు ఉంటుందని తెలిపారు .మహిళలు తిలకం దిద్ది స్వాగతం పలికారు .గ్రామంలో ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ మార్కెట్ కమిటీ చైర్మన్ వనిత రవీందర్ రెడ్డి సర్పంచ్లు పోరం మండల అధ్యక్షులు ఉమేష్ చంద్ర ఎంపీపీ ఉపాధ్యక్షులు పాపయ్య ఎంపిటిసిల పోరం మండల అధ్యక్షులు శ్రీనివాస రైతు సమన్వయ మండల అధ్యక్షులు మల్లేషం మాజీ ఎంపీపీ రామచంద్రం బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్ గుడుమల్ల రాజలింగం బిఆర్ఎస్ పార్టీ నాయకులు గుండెల్ని వేణు రాజు మధుసూదన్ రెడ్డి వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.




