-ఆరు సూత్రాలు నమ్మితే ప్రజలు ఆగమవ్వడం ఖాయం..
-అభివృద్ధి చూసి ఓటు వేయండి
– ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
(తిమ్మాపూర్ నవంబర్ 22 )
కాంగ్రెస్ మాయమాటలు మోసపూరిత హామీలు,వారంటీ గ్యారెంటీ లేని ఆరు సూత్రాల దొంగ కాంగ్రెస్ హామీలను నమ్మి ప్రజలు ఓటేస్తే ఆగమైతరని మళ్లీ ఊర్లను అంధకారం చేస్తారని మానకొండూర్ ఎమ్మెల్యే, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ అన్నారు.
తిమ్మాపూర్ మండలంలోని నూస్తులపూర్, మొగిలిపాలెం గ్రామాల్లో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ప్రజలు వందలాది సంఖ్యలో తరలివచ్చి ప్రజానేత రసమయయి కి బొట్టుపెట్టి, మంగళహారతులు పట్టి బతుకమ్మలతో స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ..
కాంగ్రెస్ పాలనలో ఊర్లలో త్రాగునీళ్లు లేవని,పంటలకు సాగునీళ్లు లేక ప్రజలు ఊర్లను వదిలి పట్టణాలకు పోయి బ్రతికారని పేర్కొన్నారు.కేసీఆర్ సీఎం అయ్యాక మిషన్ భగీరథ ద్వారా ఊరూరా త్రాగునీళ్లు, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీళ్లు ఇచ్చి రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.నెర్రెలు భారిన నెలలకు గోదావరి నీళ్లు ఇచ్చి పచ్చటి మాగానులుగా తీర్చిదిద్దడం జరిగిందని,రైతుబంధు ద్వారా ఎకరాకు 10వేల పెట్టుబడి సాయం, రైతుభీమా ద్వారా 5లక్షల సాయం ఇచ్చి అదుకున్నామని అన్నారు.కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాల ద్వారా పేదింటి ఆడబిడ్డలకు లక్ష 116 సాయం అందించడం జరుగుతుందన్నారు.
కాంగ్రెస్ అభ్యర్థి కవ్వంపల్లి కి సంస్కారం లేదని, కనీస జ్ఞానం లేకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడని,
కాంగ్రెస్ మాయాలోపడి ప్రజలు ఆగం కావొద్దన్నారు.కరోనా సమయంలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న సమయంలో అప్పుడు కాంగ్రెస్ అభ్యర్ధి కవ్వంపల్లి కి ప్రజలు ఎందుకు గుర్తు రాలేదని, ఇప్పుడు ప్రజలను కలిసేందుకు కవ్వంపల్లి ఏ ముఖం పెట్టుకుని ఊర్లలోకి వస్తున్నాడని అన్నారు.ప్రతి దళిత కుటుంబానికి 10లక్షల సాయం చేస్తామని, ప్రభుత్వ భూములకు పట్టాలు కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ బీఆర్ఎస్ పార్టి మండల అధ్యక్షులు రావుల రమేష్,బీఆర్ఎస్ పార్టి రాష్ట్ర నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాస్ రావు, కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, నూస్తులపూర్ ఎంపిటిసి కొత్త తిరుపతి రెడ్డి, మొగిలిపాలెం ఎంపి టిసి పాశం తిలక్ ప్రియ – అశోక్ రెడ్డి, బీఆర్ఎస్ మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు….





