రాజకీయం

ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు..

60 Views

( తిమ్మాపూర్ జూన్ 19)

తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోరెపల్లి రమణా రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు..

ఈ సందర్భంగా మోరపల్లి రమణా రెడ్డి మాట్లాడుతూ..

మీ పట్టుదల, ఓపిక ఎంతో మందికి స్పూర్తిని ఇచ్చిందన్నారు. మీరు ఇలాంటి స్పూర్తిని కొనసాగించాలని కోరుకుంటున్నామన్నారు. మీ నిజాయితీ కలిగిన కృషితో ప్రజలకు సేవ చేస్తూ, మీకు మంచి ఆరోగ్యం, సంతోషం, విజయాలను సమృద్ధిగా ఇవ్వాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాననీ అన్నారు. తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఆరునెలలు గడిచాయి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ఉచిత హామీలను నెరవేర్చా మన్నారు. ఉచిత బస్సు ప్రయాణం, 200. యూనిట్లు వరకు ఉచిత విద్యుత్, 500 రూపాయలకే వంట గ్యాస్, 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పెంచామని రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ నాయకత్వం మరింత బలంగా బలపరిచి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే మా లక్ష్యమని అన్నారు.

ఈ కార్యక్రమంలో నుస్తులాపూర్ ఎంపీటీసీ కొత్త తిరుపతి రెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు యస్.ఎల్.గౌడ్, మండల ప్రజా పరిషత్ కో – ఆప్షన్ సభ్యులు సయ్యద్ తాజోద్దీన్ కాంగ్రెస్ పార్టి మండల నాయకులు,కాంగ్రెస్ పార్టీ గ్రామా శాఖ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు..

Oplus_131072
Oplus_131072
కొమ్మెర రాజు తిమ్మాపూర్