(మానకొండూర్ నవంబర్ 17)
మానకొండూరు నియోజకవర్గం లోని బిజెపి అభ్యర్థి అయిన ఆరేపల్లి మోహన్ కు పవన్ కళ్యాణ్ సూచనల మేరకు బేషరతు గా, మద్దతు ప్రకటిస్తున్నట్లుగా మానకొండూరు నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ పైసా మోజెస్, తెలిపాడు..
ఈ సందర్భంగా మానకొండూరు నియోజకవర్గం లోని అన్ని గ్రామాల పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద మొత్తంలో ఆరేపల్లి మోహన్ బహిరంగ సభలలో పాల్గొనాలని ఆరేపల్లి మోహన్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఆరేపల్లి మోహన్ మాట్లాడుతూ..
బిజెపికి జనసేన తోడు కావడంతో అదనపు బలం వచ్చిందని కచ్చితంగా మంచి మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్త చేస్తూ, సంఘీభావం తెలిపిన జనసేన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు..
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పడాల ప్రసాద్, దయ్యాల నాగరాజు, ల్యాగాల మధు, పడాల సాయికుమార్, సొల్లు రాకేష్, జనసేన కార్యకర్తలు, బీజేపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..