దరువు ఎల్లన్న విశ్వసనీయతను దెబ్బ తీయలేరు..
(మానకొండూర్ నవంబర్ 22)
మానకొండూరు నియోజకవర్గం లో మంగళవారం సాయంత్రం నుండి సోషల్ మీడియాలో, కొన్ని చానలలో సర్కులేట్ అవుతున్నన ఆడియో లో తాను రసమయి సంభాషించినట్లు ఆ సంభాషణలో కేసీఆర్ను బూతులు తిట్టినట్టు వైరల్ అవుతున్న ఆడియో పై దరువు ఎల్లన్న మానకొండూరులో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఓ నకిలీ ఫ్యాబ్రికేటెడ్ ఆడియోను సృష్టించి దానిని సోషల్ మీడియా ద్వారా వైరల్ చేస్తూ తన యొక్క విశ్వసనీయతను ప్రతిష్ట లకు భంగం కలిగేటట్లు చేసిన వ్యక్తుల పై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు పేర్కొన్నాడు..
రసమయితో తాను ఫోన్లో గత 15 సంవత్సరాల కాలంలో మాట్లాడలేదని కావాలని, ఆడియోను సృష్టించి ప్రచారం చేస్తున్నారని మానకొండూరులో రసమయి గెలుపును ఆపలేరని తన తన విశ్వసనీయతను దెబ్బతీయలేరని దరువు ఎల్లన్న పేర్కొన్నాడు.