రాజకీయం

ఎమ్మెల్యేగా గెలిపించండి.

242 Views

మెదక్ నవంబర్ 1 :గ్రామాలను ఆర్థికంగా పరిపుష్టం చేసిన బీఆరెస్ పార్టీకి ఓటేసి కేసీఆర్ ను మూడోసారి సీఎం చేయాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ శేరి.

*ఎమ్మెల్యే గా పద్మా దేవేందర్ రెడ్డి ని గెలిపించాలని కార్యకర్తలను కోరిన ఎమ్మెల్సీ శేరి

రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి వర్యులు హరిశ్ రావు అధ్యక్షతన ఎమ్మెల్సీ శేరి వ్యవసాయ క్షేత్రంలో మెదక్ నియోజకవర్గానికి సంబంధించిన మెదక్, హావేలి ఘనపూర్ మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి ప్రసంగిస్తూ, తెలంగాణ గ్రామాలను ఆర్థికంగా పరిపుష్టం చేసిన బీఆరెస్ పార్టీకి ఓటేసి కేసీఆర్ ను మూడో సారి సీఎం చేయాలని ఎమ్మెల్సీ పిలుపునిచ్చారు. పార్టీలో కష్టపడ్డ వారికి పదవులు లభిస్తాయని, ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటానని మంత్రి హరీష్ రావు హామీనిచ్చారని ఎమ్మెల్సీ తెలిపారు. బీఆరెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కష్టపడి బీఆరెస్ పార్టీ అభ్యర్థి పద్మా దేవేందర్ రెడ్డిని ఎమ్మెల్యే గా గెలిపించాలని ఎమ్మెల్సీ శేరి కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ లావణ్య రెడ్డి, ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, మెదక్ మునిసిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మెదక్ ఎంపీపీ యమునా జయరాం రెడ్డి, మెదక్ మండల పార్టీ అధ్యక్షుడు అంజా గౌడ్, నియోజకవర్గ ఇంచార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, రెండు మండలాల సర్పంచులు ఎంపీటీసీలు ముఖ్య నాయకులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *