మంచిర్యాల జిల్లా
బీజేపీలో మంచిర్యాల మరియు నస్పూర్ కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీల 200 మంది కార్యకర్తలు సాయి థాకూర్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కార్యాలయంలో బీజేపీ పార్టీ చేరడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ మంచిర్యాల అసెంబ్లీ MLA అభ్యర్థి రఘునాథ్ వెరబెల్లి యువకులకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.
ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ పాలనకు అన్ని వర్గాల ప్రజలు ఆకర్షితులై రాష్ట్రంలో కూడా బీజేపీ పార్టీ గెలిస్తే డబుల్ ఇంజన్ సర్కార్ తో రాష్ట్రం మోదీ గారి నాయకత్వంలో మరింత అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందుతాయని అన్నారు. కావున అభివృద్ధి మరియు సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసే బీజేపీ పార్టీకి ఓటు వేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పురుషోత్తం, పురుషోత్తం జాజూ, వంగపల్లి వెంకటేశ్వర్ రావు, జోగుల శ్రీదేవి, బొద్దన మల్లేష్, ఆకుల అశోక్ వర్ధన్, గాజుల ప్రభాకర్ మరియు తతిదరులు పాల్గొన్నారు.
