కొండపాక నవంబర్ 12: కొండపాక మండలంలోని దుద్దెడ గ్రామంలో దీపావళి పండుగ సందర్భంగా దుద్దెడ పద్మశాలి చేనేత సంఘం ఆధ్వర్యంలో గ్రామ దేవతలు అయిన ముత్యాల పోచమ్మ నల్ల పోచమ్మ మార్కండేయ శోభ యాత్ర మహోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొనీ ప్రేత్యక మైన పూజలు చేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి, ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ చేనేత కార్మికులకు పింఛన్లు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ది అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పద్మశాలీలకు పెద్దపీట వేశారన్నారు. ఈ కార్యక్రమంలో దుద్దెడ గ్రామ సర్పంచ్ మహాదేవ్ మండల పార్టీ అధ్యక్షుడు నూనె కుమార్ యాదవ్ పద్మశాలి సంఘం అధ్యక్షుడు బొజ్జమహదేవ్, వడ్లకొండ శ్రీనివాస్, బింగి భాస్కర్, గోనె రమేష్, లక్ష్మీనారాయణ, కొంకలచ్చయ్య, శ్రీనివాస్ తదితరులున్నారు.