మెదక్ నవంబర్ 20 :మెదక్ లో ప్రియాంక సభ రద్దు?
జన సమీకరణ కుదరదని మైనంపల్లి కీలక నిర్ణయం.
పరేషాన్ లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్
ఎన్నికలవేళ కాంగ్రెస్ అపసోపాలు ఎదుర్కొంటుంది. మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో హోరాహోరీ పోరు ఉంటుందని భావించినప్పటికీ.. కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ తన సత్తా చూపలేకపోతున్నారు. అఖిల భారతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభ పూర్తిగా విఫలం కావడం ఆ పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైంది. నామినేషన్ కార్యక్రమాన్ని కూడా పేలవంగా నిర్వహించారు. నామినేషన్ కార్యక్రమానికి జన సమీకరణ చేయడం లేదని, ప్రియాంక గాంధీ సభ ఉన్నందున జన సమీకరణ అవసరం లేదని ఆ పార్టీ అభ్యర్థి నేరుగా మెసేజ్ పెట్టడం కలకలం రేపింది. తాజాగా ప్రియాంక గాంధీ సభ కూడా రద్దవుతుందన్న విషయం కలకలం రేపుతుంది. కాంగ్రెస్ కార్యకర్తలను తీవ్ర విస్మయానికి గురిచేస్తుంది. ప్రియాంక గాంధీ సభకు తాము జన సమీకరణ చేయడం కష్టమని మైనంపల్లి తెలిసి చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ విషయమై పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా మాట్లాడినప్పటికీ స్పందన లేదన్న ప్రచారం జరుగుతుంది. మొత్తానికి మెదక్ కాంగ్రెస్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ప్రచార కార్యక్రమాల హడావుడి లే