24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 3)
చిల్కానగర్ డివిజన్లోని సీత రామ కాలనీలో 62 లక్షల
వ్యయంతో వేసిన సిసి రోడ్ పనులను జిహెచ్ఎంసి అధికారులతో కలిసి పర్యవేక్షించిన కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ మాట్లాడుతూ చిల్కానగర్ డివిజన్లొ బస్తీలలో కాలనీలలో సీవరేజ్ మరియు స్ట్రామ్ వాటర్ డ్రైన్ పైపులైన్ల పనులు పూర్తయిన ప్రాంతాల్లో ప్రణాళిక బద్దం గా
నూతన సీసీ రోడ్లు వేయిస్తున్నమని అన్నారు.
అదేవిధంగా జిహెచ్ఎంసి ఎలక్షన్లో ఇచ్చిన ప్రతి హామీ ని నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతున్నానని కార్పొరేటర్ బన్నాల తెలిపారు.
వేసిన సీసీ రోడ్డుకు నిర్దేశించిన సమయానుసారం క్యూరింగ్ చేయాలని, అదేవిధంగా రోడ్డు ఇరువైపులా మట్టి నింపి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని కాంట్రాక్టర్ ని కార్పొరేటర్ ఆదేశించడం జరిగింది
కాలనీలో నూతన సీసీ రోడ్లు వేయించినందుకు సీత రామ కాలనీ అధ్యక్షులు గూడూరు రమేష్ గౌడ్ మరియు వారి కార్యవర్గం కార్పొరేటర్ గీత ప్రవీణ్ కి కృతజ్ఞతలు తెలుపుతూ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి, ఏఈ రాజ్ కుమార్ ,వర్క్ ఇన్స్పెక్టర్ కేదార్, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్,ఎదుల కొండల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కోకొండ జగన్, రామానుజం ,బాలు, శ్యామ్ సీత రామ కాలనీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
