చెన్నూరు నియోజకవర్గం మందమరి మండలంలోని మామిడిగట్టులో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డం వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం చేశారు.
నవంబర్ 30వ తేదీన జరిగే పోలింగ్లో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకే ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
తర్వాత గడ్డం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ తాను ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా లేకున్నా కూడా చాలా అభివృద్ధి పనులు చేశానని ఆయన తెలిపారు. ముఖ్యంగా మామిడి గట్టు గ్రామంలో ఐదు బోర్లు వేశానని అదేవిధంగా స్కూలుకు బెంచీలు ఇచ్చామని ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో నేను పదవిలో లేకుండా కూడా చేశానని గడ్డం వివేక వెంకట్ స్వామి తెలియజేశారు.
