రాజకీయం

మంచిర్యాల బీజేపీ ఎన్నికల ప్రచారంలో ఈటెల రాజేందర్

230 Views

నస్పూర్ పట్టణంలో బీజేపీ మంచిర్యాల అసెంబ్లీ అభ్యర్థి రఘునాథ్ వెరబెల్లి చేపట్టిన భారీ బైక్ ర్యాలీకి బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్ శ్రీ ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా పాల్గొని బైక్ ర్యాలీలో పాల్గొనడం జరిగింది.

ఈటెల రాజేందర్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం అవరణలో ఏర్పాటు చేసిన హెలి ప్యాడ్ వద్ద రఘునాథ్ మరియు బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు అనంతరం బైక్ ర్యాలీ ద్వారా తెలంగాణ తల్లి విగ్రహం, శిర్కే సెంటర్, రాయల్ టాకీస్, చేపల మార్కెట్, సంగ మల్లయ్య పల్లె, శ్రీరామ్ పూర్ బస్ స్టాండ్ నుండి సిసిసి కార్నర్ వద్ద ముగిసింది. అనంతరం సీసీసీ కార్నర్ వద్ద ప్రజలను ఉద్దేశించి ఈటెల రాజేందర్ గారు ప్రసంగించడం జరిగింది.

రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు ఉన్న బకాయిలు చెల్లించకపోతే సింగరేణి ప్రాంతం నుండి ఒక్క ఓటు కూడా కెసిఆర్ కు పడకుండా చేస్తాం.

సింగరేణి సంస్థను నిట్టనిలువునా మించిన ఘనుడు కెసిఆర్.

గత 60 ఎండ్ల పాలనలో పేదలను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా పేదల సంక్షేమం అని భూటకపు మాయ మాటలతో మరొకసారి ప్రజలను మోసం చేస్తుంది.

బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించిన ఘనత బీజేపీ పార్టీ మరియు మోదీదే.

కాంగ్రెస్ పాలనలో బీసీలకు అన్యాయం, ఏ ఒక్క బీసీ ని ముఖ్యమంత్రి చేయని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు బీసీ డిక్లరేషన్ అని డ్రామాలు చేస్తున్నది.

మంచిర్యాల నియోజకవర్గంలో ప్రజల కోసం పోరడుతున్న మరియు ఏ కష్టం వచ్చిన నేను ఉన్న అంటూ నిరంతరం ప్రజలకు సేవ కార్యక్రమాలు చేస్తున్న రఘునాథ్ ని గెలిపించండి. రఘునాథ్ కి ఓటు వేస్తే నాకు ఓటు వేసినట్టే.

సింగరేణి సంస్థలో కాంట్రాక్ట్ అనే పదం అని వినపడవద్దని సింగరేణి సంస్థను ప్రైవేట్ పరం చేసిన ఘనుడు కెసిఆర్.

సకల జనుల కోసం పని చేసే బీజేపీ పార్టీకి అవకాశం ఇవ్వండి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తాం.

నస్పూర్ ఎన్నికల ప్రచార సభలో బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్.

 

 

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *