కొడకండ్ల గ్రామంలో ప్రభుత్వ డబుల్ బెడ్ రూములు అమ్ముకున్న బి ఆర్ ఎస్ నేతలు
నవంబర్ 18
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ఈ మధ్యకాలంలో ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలను నిరుపేదలైన సెలక్షన్ లిస్టులో పొందుపరిచి డబుల్ బెడ్ రూములు సాంక్షన్ వచ్చిన తర్వాత ఇవ్వకుండ కొడకండ్ల గ్రామ బిఆర్ఎస్ నేతలు ఎంపీటీసీ మరియు టిఆర్ఎస్ సీనియర్ నాయకులు రవీందర్రావు గ్రామ అధ్యక్షులు భాస్కర్ మరియు మండల ప్రజా ప్రతినిధులు కలసి తన అనుచరులైన దారా దత్తం చేస్తూ అమ్ముకోవడం జరిగింది ఈ విషయాన్ని తెలుసుకొని గ్రామంలోని లబ్ధిదారులు అందరు కలిసి గ్రామ నాయకులను నిలదీయగా మా ఇష్టం వచ్చినట్లు మేము ఇచ్చుకుంటాము మా ప్రభుత్వం మా ఇష్టం అంటూ మీకు దిక్కున చోట చెప్పుకోండి అని వెళ్ళిపోయారు ఈ విషయాన్ని ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకుపోయిన న్యాయం జరగకపోవడంతో లబ్ధిదారులo అందరం కలిసి మాట్లాడుతూ.
మాకు జరిగిన అన్యాయానికి మనస్తాపంతో ఈరోజు పత్రికా ముఖంగా అందరికీ తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అన్యాయానికి గురైన లబ్దిదారులు పులిమామిడి స్వప్న, జకిరా బేగం, ఎడ్ల సత్యమ్మ ,ఎరుకల నరసమ్మ ,కళ్యాణి, నరేష్, హ జీముద్దీన్, మహమ్మద్ అన్వర్, ఎరుకల కిష్టయ్య, నడిగోటు కృష్ణ, తదితరులు పాల్గొన్నారు
