(మానకొండూర్ నవంబర్ 18)
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి సోమవారం మానకొండూరు అసెంబ్లీ వర్గం కేంద్రంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లను రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్.. బి.ఆర్.ఎస్. జిల్లా అధ్యక్షులు జివి రామకృష్ణారావు, జెడ్పిటిసి సభ్యులు ఎంపీపీలు పార్టీ మండల అధ్యక్షులతో సమీక్షించారు.
శనివారం మానకొండూరు మండల కేంద్రంలోని బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో వినోద్ కుమార్ జెడ్పిటిసి సభ్యులు, పార్టీ నాయకులతో సమావేశమయ్యారు.
ముఖ్యమంత్రి ఎన్నికల బహిరంగ సభను విజయవంతం చేసేందుకు భారీగా జన సమీకరణ చేయాలని వినోద్ కుమార్ పార్టీ నాయకులకు సూచించారు.
మానకొండూరు నియోజకవర్గం పరిధిలోని శంకరపట్నం, గన్నేరువరం, ఇల్లంతకుంట, మానకొండూరు, తిమ్మాపూర్, బెజ్జంకి మండలాల నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని ఆయా మండలాల జడ్పిటిసి సభ్యులు, ఎంపీపీలు, మండల పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, నాయకులకు వినోద్ కుమార్ సూచించారు.
సభా వేదిక ఏర్పాట్లను వినోద్ కుమార్ సమీక్షించారు.
ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షులు జివి రామకృష్ణారావు, జడ్పిటిసి సభ్యులు శేఖర్ గౌడ్, పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.