-కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి..
(తిమ్మాపూర్ నవంబర్ 18)
తిమ్మాపూర్ లో ఈనెల 20వ తేదీన జరగబోయే సీఎం సభకు ప్రటిష్ట పద్ధతి ఏర్పాటు చేస్తున్నట్లు కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి తెలిపారు.
తిమ్మాపూర్ మండల కేంద్రంలోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో సభ స్థలాన్ని కరీంనగర్ రూరల్ ఏసిపి తాండ్ర కర్ణాకర్ రావు తో కలిసి శనివారం పరిశీలించారు. హెలీప్యాడ్ ఏర్పాట్లు,సభావేదిక భారీకేడ్ల ఏర్పాటులను పర్యవేక్షించారు. సీఎం సభకు ఎలాంటి అవాంతరాలు ఏర్పడకుండా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలని స్థానిక సీఐ ఇంద్రసేనారెడ్డి కి ఆదేశించారు..
ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ ఎస్సై ప్రమోద్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రావుల రమేష్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు..