కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే
(తిమ్మాపూర్ సెప్టెంబర్ 30)
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో దేశ ప్రజల దృష్టి సీఎం కేసీఆర్ వైపుమళ్లిందని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. తిమ్మాపూర్ మండలంలోని తిమ్మాపూర్, మొగిలిపాలెం, పోరండ్ల, మహాత్మనగర్ గ్రామాలలోని వివిధ పార్టీల నుంచి 500 మంది యువకులు, నాయకులు శనివారం మానకొండూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ పార్టి లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్..
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులకు ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా, ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ తాగునీటిని అందిస్తూ దేశంలోనే ఆదర్శవంతమైన పాలనను సీఎం కేసీఆర్ అందిస్తున్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టిలో చేరుతున్నట్లు చెప్పారు.
దేశ వ్యాప్తంగా సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో మానకొండూర్ బీఆర్ఎస్ పార్టి భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమన్నారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల రమేష్ రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి,వివిధ గ్రామాలకు చెందిన సర్పంచులు,ఎంపిటిసిలు, బీఆర్ఎస్ పార్టి నాయకులు తదితరులు పాల్గొన్నారు…