అలంపూర్ :నవంబర్ 17
24/7 తెలుగు న్యూస్
ఈరోజు అలంపూర్ నియోజకవర్గంలోని ఉండవెల్లి మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన అలంపూర్ యువజన నాయకులు ఆర్ కిషోర్. ఈ ప్రచారంలో భాగంగా ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామి రెడ్డి బలపరిచిన అలంపూర్ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలను గడపగడపకు వివరిస్తూ ప్రచారంలో ముందుకు వెళ్తున్నారు. విజయుడు సారు కారు సర్కారు అనే నినాదంతో కార్యకర్తలు ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.





