మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం
నవంబర్ 17
సిద్దిపేట జిల్లా మర్కూక్ మండల కేంద్రానికి చెందిన గుంటి రేణుక పాము కాటుకు గురై చనిపోవడం జరిగింది.
ఈ విషయం తెలుసుకున్న మర్కూక్ మండల పార్టీ అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ అచ్చంగారి భాస్కర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బాధితురాలి పిల్లల పేరుమీద ఫిక్సడ్ డిపాజిట్ చేయటానికి కుటుంబానికి రూ.100000, లక్ష రూపాయల, ఆర్థిక సాయాన్ని అందించారు. సీనియర్ నాయకులు, మాధవరెడ్డి, సుధాకర్ రెడ్డి, సాయిని మహేష్,మోర్సు శ్రీనివాస్ రెడ్డి,పాపోల్ల రాజు, బుల్లె మల్లేష్,ఐలయ్య, మల్లేష్,అశోక్ తదితరులు పాల్గొన్నారు.





