మైలారం లో యెండల లక్ష్మినారాయణ
నవంబర్ 16
కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలం మైలారం గ్రామం లో బాన్సువాడ నియోజకవర్గం భారత జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి యెండల లక్ష్మినాయరాయణ రావడం జరిగింది. ఆయన మాట్లాడుతు కుటుంబ పాలనను ఓడించాలి అని, ప్రజలే తన కుటుంబం అని ప్రజల కోసం ఎన్నో చేసిన మోడీ ప్రభుత్వాన్ని గెలిపించాలని భాయ్ సాబ్ అన్నారు.
ఇన్ని రోజులు రాష్ట్రం లోనే ఎక్కువ ఇల్లు బాన్సువాడ నియోజకవర్గంలోనే కట్టమని ప్రచారం చేసుకుంటున్న బిఆర్ఎస్ నాయకులు, మరి ఆ ఇంటి లబ్దిదారులకు ఎందుకు పట్టాలివ్వలేదని ప్రశ్నించారు, పట్టాలిస్తే దాని పై ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద మోడీ ఫొటో ఉంటుంది కనుక అందులో సగం డబ్బులు కేంద్రమే ఇస్తుందని ప్రజలకి తెలిసిపోతుందని పట్టాలు ఇవ్వలేదని చెప్పారు. అలాగే గ్రామ పంచాయతీకి వస్తున్న నిధులు కేంద్ర ప్రభుత్వానివి కావా అని ప్రశ్నించి, చీమల దండు కదిలింది ఖబర్ధార్ అని యెండల లక్ష్మినారాయణ అనడం జరిగింది.





