కవ్వంపల్లి కి బ్రహ్మరథం పట్టిన గొల్లపల్లి గ్రామ ప్రజలు
(తిమ్మాపూర్న వంబర్ 16)
మానకొండూర్ నియోజకవర్గం తిమ్మాపూర్ మండలంలోని గొల్లపల్లి మానకొండూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డా.కవ్వంపల్లి సత్యనారాయణ, ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వారికి డప్పు చప్పుళ్లతో, కోలాటలతో మహిళలు, గ్రామ ప్రజలు అపూర్వ స్వాగతం పలికి బ్రహ్మరథం పట్టారు….
ఈ సందర్భంగా కవ్వంపల్లి మాట్లాడుతూ..
బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రన్ని పదహేన్లు పరిపాలించి, నిరుపేదలకు ఒక డబుల్ బెడ్ రూమ్ అయిన ఇచ్చిండా, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి లేదు, కొత్త పింఛన్లు, కొత్త రేషన్ కార్డుల ఓసే లేదు, రైతు ల రుణామాఫి లేదు, ఇలా చెప్పు కుంటు పోతే ఒక్క హామీ నైనా నెరవేర్చని తెలంగాణ ప్రభుత్వన్ని తరిమికొట్ట లని గొల్లపల్లి గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు…
ఎమ్మెల్యే రసమయి కి ప్రజలు బుద్ది చెప్పే సమయం వచ్చిందని, రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ జరగాలన్నా, ఉద్యోగాల భర్తీ జరగాలన్నా కాంగ్రెస్ అధికారంలోకి రావాలి అని మహిళలకు ప్రతీ నెలా రూ.2500 రావాలంటే రాష్ట్రంలో కాంగ్రెస్ రావాలి అని రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తాం అలాగే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తాం రైతులకు, కౌలు రైతులకు ప్రతీ ఏటా ఎకరాకు రూ.15వేలు.. రైతు కూలీలకు రూ.12వేలు, చేయూత పథకం ద్వారా నెలకు రూ.4000 పెన్షన్ అందిస్తాం అని పేద ప్రజల సొంత ఇంటి కల నెరవేరాలంటే కాంగ్రేస్ అధికారంలోకి రావాలన్నారు..
అనంతరం కవ్వంపల్లి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరిన గొల్లపల్లి యువకులు, వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు..
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోరపల్లి రమణ రెడ్డి, కాంగ్రెస్ పార్టి జిల్లా కార్యదర్శి మామిడి అనిల్ కుమార్, గొల్లపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు పింగిలి కిష్టారెడ్డి, కాంగ్రెస్ పార్టీ గ్రామ సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువకులు, మహిళలు, గ్రామల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.