Breaking News

తిరుపతి కొండపై ఎల్లారెడ్డిపేట మహిళ అదృశ్యం ఎల్లారెడ్డిపేట లో ప్రత్యక్షం

124 Views

ఎల్లారెడ్డిపేట అక్టోబర్ 19 ; శ్రీవారి నీ దర్శించుకుని తిరుపతి కొండపై లడ్డూల కోసం క్యూలైన్ కట్టి అక్కడే జరిగిన తోపులాట లో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన శ్రీగాధ సౌందర్య ( 75 ) అనే మహిళ సోమవారం అదృశ్యం కాగా ఎల్లారెడ్డిపేట లో బుధవారం రాత్రి ప్రత్యక్ష మైంది, ఆమెతోపాటు తిరుపతి యాత్రకు వెళ్లిన ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన పోతూ ఆంజనేయులు చెప్పిన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి , ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన శ్రీగాధ సౌందర్య సోమవారం సాయంత్రం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని అనంతరం తిరుపతి కొండపై లడ్డుల కోసం క్యూలైన్ కట్టగా అక్కడ తోపులాట జరిగిందని ఆ తోపులాట అనంతరం ఆమె కోసం చూడగా ఆమె తప్పిపోయిందని ఆమె కోసం యాత్రకు వెళ్లిన అందరం తిరుపతి కొండపై ఎంత వెతికినా ఫలితం లేకుండా పోయిందని వెంటనే అక్కడి పోలీసులకు సోమవారం రాత్రి 11-00 గంటల ప్రాంతంలో ఫిర్యాదు చేయడం జరిగిందని ఆయన తెలిపారు, అక్కడి పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీ కెమెరా ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారని ఆయన తెలిపారు, అనంతరం తాము వివిధ పుణ్యక్షేత్రాలధర్శనం లో భాగంగా బుధవారం కాళహస్తిలో ఉన్నట్లు ఆయన చెప్పారు ప్రస్తుతం అదృశ్యమైన సౌందర్య శ్రీశైలంలో కూడా ఒకసారి తప్పిపోగా తాము వెతికి పట్టుకున్నామన్నారు, తిరుపతి కొండపై తప్పిపోయిన తాను తనతో పుణ్యక్షేత్రాలకు వెళుతున్న వారిని కలుసుకోవేకపోయానని చివరకు ఇళ్ళుచేరుకోవలనే ఉద్దేశం తో ఇతరుల సహాయం తో తిరుపతి బస్టాండ్ కు అక్కడి నుండి హైదరాబాద్ కు చేరుకొని అక్కడి నుంచి తన స్వగ్రామమైన ఎల్లారెడ్డిపేట లోని తన ఇంటికి శ్రీ వెంకటేశ్వర స్వామి దయతో క్షేమంగా చేరుకొని తమ కుటుంబ సభ్యులను కలుసుకున్నట్టు సౌందర్య చెప్పింది ,

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7