24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 11)
రొక్కాడితే డొక్కాడని కూలీలు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలతో రోడ్డుపై అచేతనంగా పడిపోయారు. వారిని తన సొంత ఆస్పత్రి నీలిమా హాస్పిటల్ కు తరలించి మానవత్వం చాటాడు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, వివరాలు సిద్దిపేట జిల్లా కొమురవెళ్లి మండలం గురవన్నపేట గ్రామానికి చెందిన కూలీలు కూలి పనులకు వెళ్లి తిరిగి వస్తున్నారు. ఈక్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు చనిపోయాగా, నలుగురు తీవ్ర గాయాలతో రోడ్డుపై అచేతనంగా పడిపోయారు. వెంటనే స్థానిక సర్పంచ్, పలువురు నాయకులు పల్లాకు సమాచారం అందించారు..వెంటనే చలించిన జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పర్యవేక్షణలో క్షతగాత్రులను తన సొంత హాస్పిటల్ అయిన నీలిమా హాస్పటిల్ కు తరలించారు. అక్కడి డాక్టర్లతో మాట్లాడి వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. కాగా, మనుషులందరిలో మానవత్వం ఉన్న మనుషులు వేరుగా ఉంటారని, రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని చూసి చలించిన ఎమ్మెల్యే పల్లా దగ్గరుండి.. సొంత ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్న ఆయన సేవలను జనగామ నియోజకవర్గ ప్రజలు కొనియాడుతున్నారు.





