ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్లో నేడు భారత్ ఘన విజయం సాధించింది.
భారతదేశం ఆతిధ్యమిచ్చి ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్ ఆడుతున్న నేపథ్యంలో నేడు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్ ముంబైలోని వాంకేడి స్టేడియంలో జరిగింది.
మొదట బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు నిర్నిత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 113 బంతుల్లో 117 పరుగులు చేసి సెంచరీ పూర్తి చేశాడు. దీనితో వన్డే క్రికెట్ చరిత్రలో 50 సెంచరీలు పూర్తిచేసిన ఆటగాడిగా చరిత్రలో నిలిచాడు. ఇంతకుముందు సచిన్ టెండూల్కర్ తన క్రికెట్ చరిత్రలో వన్డే క్రికెట్ మ్యాచ్ లో 49 సెంచరీలు చేశాడు, విరాట్ కోహ్లీ సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేసి 50 సెంచరీలు పూర్తి చేశాడు.
శ్రేయస్ అయ్యర్ 70 బంతుల్లో 105 పరుగులు చేసి సెంచరీ పూర్తి చేశాడు.
మహమ్మద్ సమీ వన్డే క్రికెట్ చరిత్రలో ఒక మ్యాచ్లో 7 వికెట్లు తీసినా ఆటగాడిగా చరిత్రలో నిలిచాడు.
తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టు నిర్ణిత 48.5 ఓవర్లలో 327 పరుగులు చేసి ఫెవిలియన్ చేరారు.
న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ మిచెల్ 119 బంతుల్లో 134 పరుగులు చేశారు.






