(తిమ్మాపూర్ సెప్టెంబర్ 27)
మానకొండూర్ నియోజకవర్గం తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, యువకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు..
రేణికుంట గ్రామానికి ముదిరాజ్ సంఘం నాయకులు, బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బుధవారం రేణిగుంట గ్రామ శాఖ అధ్యక్షుడు ఎలుక రాజు ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్బంగా కవ్వంపల్లి మాట్లాడుతూ…
గత తొమ్మిదిన్నర సంవత్సరాల నుండి ప్రజలను మోసం చేస్తున్న బిఆర్ఎస్ పార్టీకి బుద్ది చెప్పడానికి యువత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అని అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు మొరపల్లి రమణారెడ్డి, జిల్లా కార్యదర్శి మామిడి అనిల్ కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు…




