ప్రాంతీయం

దరిద్రం పోయింది గుమ్మడికాయ పగిలింది…

345 Views

ముస్తాబాద్, నవంబర్15 (24/7న్యూస్ ప్రతినిధి) బిజెపి పట్టణ అధ్యక్షుడు మెంగని మహేందర్ ఆధ్వర్యంలో వివేకానంద విగ్రహంవద్ద పత్రికా సమావేశం నిర్వహించి ముస్తాబాద్ మండలానికి పట్టినశని దరిద్రం పోయిందని దిష్టితీసి ప్రధాన రహదారిపై బారిగుమ్మడికాయ కొట్టారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలో చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. తెలంగాణలో బిజెపి ప్రభుత్వం ఏర్పడగానే విద్యా, వైద్యం గృహిణిలకు గ్యాస్ సిలిండర్, వరికి మద్దతు ధర 3100/- కల్పిస్తుందని తెలిపారు. ముస్తాబాద్ మండల అధ్యక్షుడు కస్తూరి కార్తీక్ రెడ్డి బిజెపిపార్టీని వీడిన విషయంపై స్పందిస్తూ అధ్యక్షుని తీరుపై ఆరునెలల క్రితమే తొలగించమని లేకరాసి జిల్లా అధ్యక్షునికి ఫిర్యాదు చేసినాము మండల నాయకులను కార్యకర్తలను కలుపుకొని పనిచేయడం లేదని ఒంటెద్దు పోకడతో పాటు అనేకమైన ఆరోపణలు అతనిపై తలెత్తాయని అన్నారు. బిజెపి పార్టీలో ఎంతో కాలంగా అనుభవం గల నాయకులు ఉండగా ఆవ్యక్తికి ఏంచూసి ఈ పదవి అంటగట్టారో మండిపడ్డారు. ఈరోజు మాబిజెపి పార్టీ నుండి విడిపోయినందుకు దరిద్రం పోయిందని గుమ్మడికాయను మూడు తొవ్వలకాడ కొట్టి తపాకాయలుకాల్చి సంబరాలు చేసుకుంటున్నామన్నారు. బిజెపిపార్టీ అభివృద్ధికి కార్యకర్తలకు సహాయ సహకారాలు అందించక పోవడమే కాకుండా మండలంలోని అన్నిబూతుల, శక్తి కేంద్రాల, వివిధ మోర్చ అధ్యక్షులు కలిసి జిల్లా అధ్యక్షునికి నాడు ఫిర్యాదు చేసిన పట్టించుకోని సందర్భం నేడు తనంతటతానే వెళ్లిపోవడంపై సంతోషం వ్యక్తం చేశామన్నారు. బిజెపి పార్టీ నుండి ఒక్కరు విడిపోతే,100, మంది కలిసి నడుచుకుంటూ తెలంగాణ గోల్కొండ కోటపై బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల భూత్ అధ్యక్షులు, వివిధ మోర్చ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, బిజెపి కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *