Breaking News

కెసిఆర్ కాలనీలో  బీఆర్ఎస్ పార్టీ ప్రచారం కారు జోరు

323 Views

పాములపర్తి గ్రామం కెసిఆర్ కాలనీలో  బీఆర్ఎస్ పార్టీ ప్రచారం కారు జోరు-

ముఖ్యమంత్రి కేసీఆర్ కు లక్ష పైగా మెజార్టీ కాయం

నవంబర్ 14

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలోని పాములపర్తి గ్రామంలో కెసిఆర్ కాలనీలో  బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని మర్కుక్ మండల ప్రజా ప్రతినిధులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి కెసిఆర్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.

ఇంటి ఇంటి ప్రచారంలో భాగంగా కెసిఆర్ చేసినటువంటి అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు తీసుకువెళ్లి,కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా హ్యాట్రిక్ సాధించి మరింత అభివృద్ధి మరియు మరిన్ని కొత్త సంక్షేమ పథకాలు తీసుకువస్తాడని,కేవలం కేసీఆర్ తోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలకు వివరించారు.

గ్రామంలోని ప్రజలందరూ కూడా కారు గుర్తుకు ఓటు వేసి ముఖ్యమంత్రిని భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు.ఈ కార్యక్రమంలో మర్కుక్ మండల్ ఎంపీపీ పాండు గౌడ్,బీసీ సెల్ అధ్యక్షుడు మేకల కనకయ్య,,గ్రామ ప్రజలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *