తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం కానీయొద్దు..
కెసిఆర్ పాలనలో రైతుల ఆత్మహత్యలు బంద్
– రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిని పల్లి వినోద్ కుమార్..
(మానకొండూర్ నవంబర్ 14)
కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కొద్దిరోజుల క్రితం బిజెపి నుండి బిఆర్ఎస్ లోకి చేరిన దరువు ఎల్లన్న,గడ్డం నాగరాజు వారి అనుచర వర్గంతో బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మెన్ జీ.వి రామకృష్ణారావు ఆద్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు..
ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ హాజరై మాట్లాడుతూ రోజురోజుకు టిఆర్ఎస్ పార్టీకీ ప్రజల ఆదరణ పెరుగుతుందని, కాంగ్రెస్ నాయకుల చేతిలోకి అదికారం వెళితే తెలంగాణ కుక్కలు చింపిన విస్తరి అవుతుందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని అవుతానని కలలు కంటున్నాడని, తెలంగాణ వ్యవసాయానికి మూడు గంటలు కరెంటు సరిపోతుందని, వ్యవసాయ బావికి 10 హెచ్పి మోటర్ సరిపోతుందని అంటున్నాడని, కానీ ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేస్తే రాత్రిపూట పొలాల దగ్గరికి వెళ్లాలంటే టార్చిలైట్ కొనుక్కునే పరిస్థితి వస్తుందని రైతులకు కాంగ్రెస్ అంటేనే చీకటి రోజులు గుర్తుకు వస్తున్నాయని అన్నారు.
కాంగ్రెస్ 60 ఏళ్లు పరిపాలించి పోచంపాడు వద్ద గోదావరి నదిపై ఒకే ఒక ఎస్సారెస్పీ ప్రాజెక్టు కట్టారని, అదే బిఆర్ఎస్ పాలనలో పదేళ్లలో ఐదు ప్రాజెక్టులను కట్టామని భద్రాచలం సీతమ్మ ప్రాజెక్టు ములుగు జిల్లా తుపాకులగూడెం వద్ద సమ్మక సారక్క ప్రాజెక్టు కడుతున్నామని మేడిగడ్డ అన్నారం సుందిళ్ల వద్ద ప్రాజెక్టులు కట్టామని కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డ కాదని మొత్తం 20 రిజర్వాయర్లని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ముఖ్యమంత్రిని ఎన్నుకోవాలన్నా హత్యలు, మూడు నెలల కర్ఫ్యూ, లాఠీచార్జులు, ఫైరింగ్లు ఉండేవని ఈ రోజున తెలంగాణ ప్రభుత్వ పాలనలో హైదరాబాద్ నగర ప్రజలు సుఖశాంతులతో బ్రతుకుతున్నారన్నారు. గ్రామాల్లో పచ్చదనంతో బ్రహ్మాండమైన పంటలు పండి పుష్కలంగా ఆర్థికంగా ఎదుగుతున్నారని విద్య వైద్యంలో తెలంగాణ బాగా అభివృద్ధి చెందిందని చిన్న పట్టణాలలో మొత్తం కలిపి 35 ప్రభుత్వం మెడికల్ కాలేజీలు కట్టామని 500 పడకల ఆసుపత్రులు కట్టామని ఇంకా అభివృద్ధి చేయవలసింది బాగానే ఉన్నదని, అది బిఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యం అవుతుందని, ప్రజలకు బిఆర్ఎస్ పార్టీ పై అపారమైన నమ్మకం ఉందని, ఎన్నికల్లో బిఆర్ఎస్ కు గెలుపు తప్పదని కాంగ్రెస్ ఓటమి తప్పదని ధీమా వ్యక్తంచేశారు.
ఈ కార్యక్రమంలో జడ్పిటిసి తాళ్లపల్లి శేఖర్ గౌడ్, టిఆర్ఎస్ నాయకులు దరువు ఎల్లన్న, గడ్డం నాగరాజు పడాల శంకరయ్య, గోపు రవీందర్ రెడ్డి, పడాల సతీష్ గౌడ్, పారునంది కిషన్, దుడ్డేల శంకర్, దండ బోయిన శేఖర్ నాయకులు కార్యకర్తలు తదితరులున్నారు




