బాధిత కుటుంబానికి ఎల్లారెడ్డి పేట సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి ఆర్థిక సహాయం అందించారు.ఇటివలే అనారోగ్యంతో మరణించిన బెస్త ఎల్లం కుటుంబాన్ని సోమవారం పరామర్శించి ఓదార్చారు.తనవంతు సహాయంగా 5 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.అలాగే భవిష్యత్తులో అన్ని విధాలుగా అండగా ఉంటానని వారికి భరోసా కల్పించారు.మండల కేంద్రంలో ఎవరికి ఏ ఆపద వచ్చిన వెంటనే స్పందిస్తూ అన్ని విధాలుగా అండగా ఉంటున్న కృష్ణారెడ్డి కి స్థానిక కాలనీవాసులు యువకులు ధన్యవాదాలు తెలియజేశారు.
