ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్, పదిరా, రాగట్లపల్లి గ్రామాలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రాణి రుద్రమ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా రాని రుద్రమ కమలం పువ్వు గుర్తుపై ఓటేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి నన్ను అధిక మెజారిటీతో గెలిపించగలరని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డి పైన గోపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మెరుగు హనుమంత్ గౌడ్ జిల్లా మైనార్టీ మోర్చా అధ్యక్షులు వాజీదు హుస్సేన్ మండల అధ్యక్షులు తిరుపతిరెడ్డి మండల ఉపాధ్యక్షులు రేపాక రామచంద్రారెడ్డి భూత్ అధ్యక్షులు బోనాల సాయికుమార్ బిజెపి మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
