దౌల్తాబాద్: బీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి.. సంక్షేమం సాధ్యమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు అన్నా రెడ్డి సుభాష్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్ లు అన్నారు. సోమవారం మండల పరిధిలోని చెట్ల నర్సంపల్లి, కొనాయిపల్లి, ముబారస్ పూర్ గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని వర్గాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాయని, సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందాయన్నారు. ఈ కార్యక్రమంలో చెట్ల నర్సంపల్లి, మల్లేశం పల్లి సర్పంచ్ లు వేమ జనార్ధన్, దార సత్యనారాయణ, ముబారస్ పూర్ ఎంపిటిసి తిరుపతి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వేమ శ్రీనివాస్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు యాదగిరి, బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు శివంది భాస్కర్, చింతకింది అశోక్ నాయకులు గంగాధరి రవీందర్, రాజగోపాల్, అశోక్, బాలయ్య, షాదుల్లా, వలి, గౌస్ తదితరులు పాల్గొన్నారు……
