రాజకీయం

ఖబర్దార్ కవ్వంపల్లి ..

355 Views

– రసమయి పై నీ లుచ్చా రాజకీయాలు మానుకో..

– బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు

(తిమ్మాపూర్ నవంబర్ 13)

మానకొండూర్ మండలకేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సుడా చైర్మెన్ జి.వి రామకృష్ణారావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కవ్వంపల్లి పై ఆగ్రహం వ్యక్తం చేశారు..

ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నామినేషన్ దాఖలు చేసిన పత్రాలను ఎటువంటి ఆటంకాలు లేకుండా రిటర్నింగ్ అధికారి అంగీకరించారని,కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారాయణ రసమయి పై బెజ్జంకి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ కాపీ ఉందనీ, గుండారంలో రసమయి కొన్న భూములను అఫిడవిట్ లో తెలుపలేదనీ ఎలక్షన్ కమిటీకి ఫిర్యాదు చేశారన్నారు.ఆయన చెప్పినట్లు బెజ్జెంకి పోలీస్ స్టేషన్ లో ఎటువంటి కేసులు లేవని, 29-4-2023న బ్లాక్ ఆఫ్ ఎవిడెన్స్ కింద కరీంనగర్ ఎసీపి క్లోస్ చేయడం జరిగిందని,రసమయిపై గాని తన కుటుంబ సభ్యులపై గానీ ఎటువంటి ఆస్తులు ఉన్నాయో అఫిడవిట్ లో స్పష్టంగా తెలియజేశారన్నారు. రెవెన్యూ భాషలో ఉన్న అక్షరాలు కూడా తెలియని కవ్వంపల్లి డాక్టర్ ఎలా పాసయ్యాడో అర్థం కావడం లేదని, ఎన్నికల్లో రసమయిని ఎదుర్కొనే ధైర్యం లేక తప్పుడు ఫిర్యాదు చేసి ఇబ్బందులకు గురి చేయాలని చూస్తున్నాడని, తోటి దళితుడిపై ప్రజాస్వామ్య బద్ధంగా గెలవాలన్నారు. కవ్వంపల్లి ఆయన సతీమణి ధాఖలు చేసిన అఫిడవిట్ పత్రాల్లోనే తప్పుడు సమాచారం ఉందని,ఇద్దరి ఇన్కంటాక్స్ రిటర్న్ పై విభేదాలున్నాయని, ఎలక్షన్ అయిపోగానే ఎలక్షన్ కమిటీకి,హై కోర్టు లో ఎలక్షన్ పిటీషన్ దాఖలు చేస్తామని,వారు భవిష్యత్తులో ఎలక్షన్లలో పోటీ చేయని పరిస్థితి వస్తుందన్నారు.పార్టీలు మారుకుంటూ నోట్లకట్టలతో పట్టుబడ్డ తెలంగాణ వ్యతిరేకైన రేవంత్ రెడ్డి పంచన చేరాడన్నారు.కొందరు కాంగ్రెస్ చిల్లర నాయకులు రసమయి నామినేషన్ పత్రాలు ఆగిపోయాయని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి రసమయిని బద్నాం చేస్తున్నారని వారిపై కూడా కేసులు పెడతామన్నారు. వేదికలపై తోటి దళితుని కుటుంబ సభ్యులను అవమానిస్తూ మాట్లాడడం మంచిది కాదన్నారు. కవ్వంపల్లి మాట్లాడేటప్పుడు బాషను అదుపులో ఉంచుకోవాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.రసమయిని ఎదుర్కొనే ధైర్యం లేకపోతే ఓటమిని అంగీకరించి ఎన్నికల నుండి ఉపసంహరించుకోవాలని, అంతేగాని పిచ్చి కూతలు కూస్తే బాగుండదని తప్పుడు ఫిర్యాదు చేసినందుకు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ తాళ్ళపల్లి శేఖర్ గౌడ్,శంకరపట్నం మండల అధ్యక్షుడు మహిపాల్,సర్పంచ్ దేవ సత్తీష్ రెడ్డి, సర్పంచ్ లు,ఉప సర్పంచ్ లు నాయకులు తది తరులు పాల్గొన్నారు..

Oplus_131072
Oplus_131072
కొమ్మెర రాజు తిమ్మాపూర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *