పాములపర్తి లో బిజెపి పార్టీ ఇంటింటి ప్రచారం
నవంబర్ 13
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో బి జె పి పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ జడ్పిటిసి సింగం సత్తయ్య, మర్కుక్ మండల బిజెపి పార్టీ అధ్యక్షుడు రమేష్ మాట్లాడుతూ బీజేపీ పార్టీ ఇంటింటి ప్రచారం లో ప్రతి ఒక్కరూ ఆప్యాయంగా పలకరిస్తూ బీజేపీ పార్టీ కి ఓటు వేసి ఈటెల రాజేందర్ ను గెలిపిస్తామని అభయం ఇస్తున్నారని బడుగు బలహీనర్గాల నాయకుడు ఈటెల రాజేందర్ కే మా మద్దతు అంటూ వివిధ సంఘాలు ఏకగ్రీవ తీర్మానం చేస్తున్నాయని మర్కుక్ మండలం లో మెజార్టీ ప్రజలు బీజేపీ వైపే ఉన్నారని రాబోయే ఎన్నికల్లో బిజెపి అఖండ విజయం సాధించి ఈటెల రాజేందర్ సీఎం గా తెలంగాణ రాష్ట్రం లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఉపాధ్యక్షులు రాజేందర్ సింగ్, తిరుపతి రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, శంకర్ రెడ్డి, రామ్ రెడ్డి, డాక్టర్ సత్యనారాయణ,తాడూరి మహేష్ గౌడ్, కే రాజు, బోయిని రాజు,కాశిరెడ్డిపల్లి సర్పంచ్ అప్పల మల్లేష్, ఎగొండ,కుంట సత్యం, కుమార్, రాజు మోర్సు కిషోర్ రెడ్డి,కిట్టు, బూడిద సురేష్ గౌడ్, బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు





