చెక్ పోస్ట్ ల వద్ద నిరంతర నిఘా పోలీసులు
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట
నవంబర్ 13
చెక్ పోస్టుల వద్ద నిరంతర నిఘా ఉండాలని పోలీసు అబ్జర్వర్ విపుల్ కుమార్ నిఘా టీములకు సూచించారు. ఆయన కలెక్టరేటులో ఏర్పాటు చేసిన ఎఫ్ ఎస్ టి, వి ఎస్ టి, ఎస్ ఎస్ టి, కంట్రోల్ రూమ్ పని తీరును పరిశీలించారు. నిఘా పఠిష్టంగా అమలు చేయాలని, నగదు, మద్యం అక్రమ రవాణ పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని సూచించారు. అనంతరం కంట్రోల్ రూములో సి -విజిల్ ద్వారా వస్తున్న ఫిర్యాదులను పరిశీలించారు.





