మర్కుక్ : పాములపర్తి 24/7 తెలుగు న్యూస్
13.11.2023
తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పిలుపు మేరకు ఈ రోజు భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరిన బి జె వై యం జిల్లా కార్యదర్శి బొడ్డు మధుసూదన్ మరియు బి జె పి నాయకులు ప్రశాంత్ మహేష్ స్వామి సర్దాని మహేష్ కర్రోళ్ల రవిలు ఈ కార్యక్రమంలో మర్కుక్ మండల పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ )పాండు గౌడ్ జడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రం సీనియర్ నాయకులు హరిపంతులు పిట్ల సత్యనారాయణ మేకల కనకయ్య గ్రామ శాఖ అధ్యక్షులు మహేష్ నాయకులు రాజేష్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ దుర్గ ప్రసాద్ మధుసూదన్ రెడ్డి కిష్టా గౌడ్ సుధాకర్ మరియు మేకల శ్రీనివాస్ లు ఉన్నారు .ఈ సందర్బంగా ఎఫ్ డి సి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి మరియు ఎంపీపీ పాండు గౌడ్ లు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో వచ్చి మాయమాటలు చెప్పి పెడదారిన యువతను నడిపించే ధోరణి సరైన విధానం కాదని వారికి అండగా ఎప్పుడు బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఉంటుందని వారు మళ్ళీ తిరిగిరావడం కొంతమందికీ మింగుడు పడడం లేదని అన్నారు. ఏదీ ఏమైనా తెలంగాణ రాష్ట్రములో మళ్ళీ బి ఆర్ ఎస్ ప్రభుత్వమే రావడం ఖాయమని ముఖ్యమంత్రి గా కెసిఆర్ హ్యాట్రిక్ కొడతారని కష్ట పడిన ప్రతీ కార్యకర్తను కాపాడుకుంటామని హామీ ఇచ్చారు





