24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (మార్చ్ 29)
ఈరోజు మహబూబాబాద్ నియోజకవర్గ గూడూరు మండల కేంద్రంలోని మజీద్ లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్యా మురళి నాయక్ ,ప్రభుత్వ విప్ రాంచంద్రు నాయక్ ,మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంజాన్ ఒక పవిత్రమైన పండుగ అని, మానవ సేవ చేయాలన్న సందేశాన్ని మానవాళికి అందించే పండుగ అని తెలిపారు. రంజాన్ మాసంలో ఆచరించే ప్రార్థనలు, ఉపవాసం క్రమశిక్షణను ఆధ్యాత్మికతను పెంపొందిస్తుందని ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా ముస్లింలు తమ పవిత్ర ప్రార్థనలతో అల్లా దీవెనలు పొందాలని అల్లాను కోరారు.
అనంతరం ముస్లిం సోదరులు వారినీ సన్మానించారు
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిట్ట వెంకన్న,మైనార్టీ సెల్ అధ్యక్షులు రసూల్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు,శ్రేణులు తదితరులు ఉన్నారు.
