ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు తక్షణమే చట్టబద్దత కల్పించాలి
విశ్వరూప మహాసభ కు పెద్ద సంఖ్యలో బయలుదేరిన ఆకునూరు మాదిగ, ఉపాకులలు
నవంబర్ 11
సిద్దిపేట జిల్లా చేర్యాల సికింద్రాబాద్ పేరెంట్ గ్రౌండ్లో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు తక్షణమే చట్టబద్దత కల్పించాలని కోరుతూ ఏర్పాటు చేసిన విశ్వరూప మహాసభ కు పెద్ద సంఖ్యలో బయలుదేరిన ఆకునూరు గ్రామస్తులు.ఈ విషయమై గడిపే బాలనర్సయ్య, యాదగిరి, పుల్లని వేణు, విశ్వేష్ లు మాట్లాడుతూ… ఎన్నికలు వస్తుంటాయి,పోతుంటాయి. కానీ ఎస్సీ వర్గీకరణ జరగనంత కాలం ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, మనకు ఒరిగేదేమీలేదు, ఏ పార్టీ ఓడినా మనకు పోయేదేమీ లేదు. మన సమయం, మన శక్తి, మన వనరులు విశ్వరూపం జయప్రదం చేయడం కోసమే అని అన్నారు. ఈ కార్యక్రమనికి బయలుదేరిన వారిలో నర్సింహులు, విజయ్, కనకయ్య, నర్సయ్య, బలవ్వ, కనకవ్వ, మరియవ్వ తదితరులు పాల్గొన్నారు
