*కదిలిన పద్మశాలి దండు
*సుమారు పదివేల మందితో లగిశెట్టి నామినేషన్ సిరిసిల్లలో పద్మశాలి దండు కదిలింది. సుమారు పదివేల మందితో భారీ ర్యాలీగా వచ్చి బుధవారం లగిశెట్టి శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు. పట్టణంలోని కొత్త బస్టాండ్ నుండి ర్యాలీగా వచ్చి అంబేద్కర్, మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి అనంతరం లగిశెట్టి నామినేషన్ దాఖలు చేశారు. ర్యాలీలో దాదాపు 7వేలకు పైగా మహిళలు, 80% పద్మశాలీలతో పాటు అన్ని సామాజిక వర్గాల ప్రజలు పాల్గొన్నారు. భారీ ర్యాలీ సందర్భంగా పట్టణంలో పలుచోట్ల ప్రయాణికులు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ ర్యాలీని చూసిన పలువురు సిరిసిల్లలో కేటీఆర్ కు చుక్కెదురు తప్పేటట్లు లేదని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు పద్మశాలిలు ఇలాగే ఒక్కతాటిపై ఉంటే లగిశెట్టి శ్రీనివాస్ గెలుపు ఖాయమని సిరిసిల్ల నియోజకవర్గ వ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది.





