మంచిర్యాల జిల్లా
మంచిర్యాల కాంగ్రెస్ అభ్యర్ధి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు బుధవారం సీపీఐ జిల్లా కార్యాలయంకు వచ్చి సీపీఐ శ్రేణులను స్నేహపూర్వకంగా కలిశారు.
ప్రేమ్ సాగర్ రావు సీపీఐ కార్యాలయంకీ చేరుకోగానే ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కళవేన శంకర్, జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి ఖలందర్ ఖాన్, ఏ.ఐ. టీ.యూ.సీ జిల్లా కార్యదర్శి మేకల దాసు స్వాగతం పలికారు.
సిపిఐ, కాంగ్రెస్ ఎన్నికల పొత్తు పొడవడం శుభసూచకమని ప్రేమ్ సాగర్ రావు,కలవెన శంకర్ మీడియా సమావేశంలో అన్నారు.
