సెప్టెంబర్ 28
*రాష్ట్ర మహాసభ ముదిరాజ్ సంఘం ఉపధ్యక్షులు కోట్టాల యాదగిరి*
సిద్దిపేట జిల్లా…
జగదేవపూర్: మండలంలోని తిమ్మాపూర్, మాందపూర్,పలుగు గడ్డ , అంతయా గూడెం,గ్రామలకు సంబంధించిన అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ బుధవారం **నాచారం దేవాలయం మాజీ చైర్మన్ రాష్ట ముదిరాజ్ సంఘం మహాసభ ఉప అధ్యక్షులు కొట్టాల యాదగిరి** హైదరాబాద్ లోని మంత్రి హరీష్ రావు నివాసం లో వినతిపత్రం అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా వారు హరీష్ రావు తో మాట్లాడుతూ ఈ మూడు గ్రామాల్లో చాలా సమస్యలు ఉన్నాయని మరియు ముదిరాజ్ ల కుల దైవం శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయాలు కూడా శిధిలావ్థలో ఉన్నాయని వాటి స్థలం లో నుతన నిర్మాణం కోసం నిధులు కేటాయించాలని మంత్రి హరీష్ రావు కోరారు.
వెంటనే సానుకూలంగా స్పందించిన మంత్రి హరీష్ రావు గ్రామాల అభివృద్ధికి. అలాగే దేవాలయలకు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం నిధులు మంజూరు చేసిన మంత్రి హరీష్ రావు గారికి కొట్టాల యాదగిరి ప్రత్యెక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆంతయ గూడెం సర్పంచ్ సిద్ధిపేట జిల్లా యూత్ విభాగం అధ్యక్షులు తిగుల్ల సత్యం.మాంధపూర్ సర్పంచ్ బిక్షపతి,పలుగు గడ్డ సర్పంచ్ రాజేశ్వరి రవి, ముదిరాజ్ సంఘం నాయకులు గ్రామాల అధ్యక్షులు ఎల్లేష్,రామచంద్రం,రాజు, వెంకటేష్,కనకయ్య, అంజయ్య, మాహెందర్, రాములు, ఇస్తారి, తదితరులు పాల్గొన్నారు.
