Breaking News

ఇంటింటికి జాతీయ జెండాలు పంపిణీ

92 Views

ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రంలో ఇంటికో జాతీయ జెండా పంపిణి ఎల్లారెడ్డిపేట ఆగస్టు 09 స్వాతంత్ర దినోత్సవం వజ్రోత్సవాల్లో జాతీయ భావాన్ని దేశభక్తిని నింపేందుకు ప్రతి ఇంటా మువ్వన్నెల జాతీయా జెండాను ఎగరవేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ పిలుపునిచ్చారు, అట్టి పిలుపు మేరకు ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామ పంచాయతీ లో ఇంటికో త్రివర్ణ పథకాన్ని అందించి ప్రతి ఇంటిపై ఎగురవేసే విధంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ స్థానిక ప్రజాప్రతినిధులతో ,నాయకులతో ,సిబ్బంది తో కలిసి మంగళవారం జాతీయ జెండాల పంపిణీ చేసి శ్రీకారం చుట్టారు, జాతీయ జెండా గొప్పతనాన్ని. స్వాతంత్ర భారతదేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పేందుకు 75 ఏళ్ల పండుగను నిర్వహిస్తామన్నారు, ఇందులో భాగంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మంగళవారం ఎంపీటీసీ సభ్యురాలు పందిళ్ళ నాగరాణి పరుశరాములు గౌడ్ , ఎలగందుల అనసూయ నర్సింలు , గ్రామపంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ లతో కలిసి ఇంటింటికి తిరిగి జాతీయ జెండాలను పంపిణీ చేసి శ్రీకారం చుట్టారు , ఈ సందర్భంగా కార్యదర్శి ప్రవీణ్ మాట్లాడుతూ ఇంటింటికి జాతీయ జెండాలను ఆగష్టు 13 , 14 , 15 మూడు రోజులపాటు ఎంతో గౌరవంగా ఎగురవేయాలని జాతీయతను చాటుకోవాలని ఆయన గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు , ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీలో 2500 జాతీయ జెండాలను పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు, ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారు బాల్ రెడ్డి, వార్డు సభ్యులు పందిల్ల శ్రీనివాస్ గౌడ్ , వి వోఏలు మరాఠీ రేణుక , అంతెర్పుల శోభారాణి , గుండం మంజుల , ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు ఎడ్ల సందీప్ , కంప్యూటర్ ఆపరేటర్ రామచంద్రం , అంజిబాబు తదితరులు పాల్గొని జాతీయ జెండాలను పంపించేశారు ,

Oplus_131072
Oplus_131072
కొండ్లెపు జగదీశ్వర్ జర్నలిస్ట్ ఎల్లారెడ్డిపేట్