అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల నియోజకవర్గం, మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 4 వార్డ్ మరియు 17 వార్డ్లో ప్రతి ఇంటికి వెళ్లి గౌరవ సీఎం శ్రీ కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సంక్షేమాభివృద్ధిని అలాగే బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించి నవంబర్ 30 వ తేదిన జరిగే ఎన్నికల్లో కారు గుర్తును ఓటు వేసి ఎమ్మెల్యే గా గెలిపించాలని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ప్రజలను కోరారు.
అనంతరం ఎమ్మెల్యే సమక్షంలో 4 వార్డ్ మరియు 17 వార్డ్ నుండి 70 మంది కాంగ్రెస్ పార్టీ మహిళలు బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
