మెదక్ ఎంపీ గా వెంకట్రాంరెడ్డి గెలుపు ఖాయం – బట్టు అంజిరెడ్డి
ఏప్రిల్ 9 తెలుగు న్యూస్ ప్రతినిధి
రాబోయే ఎంపీ ఎన్నికల్లో మెదక్ ఎంపీ అభ్యర్థి గా ఎమ్మెల్సీ వెంకట్రాo రెడ్డి గెలుపు ఖాయమని డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా ములుగు మండల కేంద్రంలో డిసిసిబి డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎంపీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి అఖండ విజయం ఖాయమని బిజెపి కాంగ్రెస్ పార్టీలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని మోసపూరిత హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని బిజెపి మాటలకే పరిమితమైందని ఆ రెండు పార్టీలు ఓటమి ఖాయమని వెంకట్రాంరెడ్డి సిద్దిపేట కలెక్టర్ గా విధులు నిర్వహించి ఈ ప్రాంత వాసుల కష్టసుఖాల్లో పాలుపంచుకున్న వెంకట్రాంరెడ్డి గెలుపు కోసం బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు కృషి చేయాలని, అలాగే ఎన్నికల్లో గెలుపొంది డబ్బులు సంపాదించే కోరిక తోటి వెంకటరామిరెడ్డి రావడంలేదని సేవాభావంతో రాజకీయాల్లోకి వస్తున్న వెంకట్రామిరెడ్డికి మనమంతా అండగా ఉండి వారిని గెలిపించే బాధ్యత మనపై ఎంతైనా ఉందని అన్నారు.
