Breaking News

మార్వాడి సుదర్శన్ కు దళిత రత్న, బెస్త నరేష్ కు దళిత యువరత్న అవార్డుల ప్రధానం

115 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా బొప్పాపూర్ కు చెందిన బెస్ట్ నరేష్ కు దళిత రత్న అవార్డు దక్కింది మంగళవారం రోజున: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో డా,బాబు జగ్జీవన్ రామ్ & డా, బి ఆర్ అంబేద్కర్ రాష్ట్రస్థాయి జయంతి ఉత్సవాల కమిటీ- 2022, ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్రభారతిలో డా,బాబు జగ్జీవన్ రామ్ 115 వ జయంతి వేడుకలు నిర్వహించారు ఎస్సీ ఎస్టీ వర్గాల గురించి విశేష కృషి చేసిన షెడ్యూల్డ్ కులాలకు చెందిన ఉద్యమకారులకు దళిత రత్న దళిత యువరత్న పేర్లతో ప్రతి సంవత్సరం అవార్డు ప్రధానం చేస్తారు ఇందులో భాగంగా ఈ సంవత్సరం సిరిసిల్ల జిల్లా కు చెందిన మార్వాడి సుదర్శన్ దళిత రత్న బొప్పాపురం వాస్తవ్యులు బెస్త నరేష్ కు దళిత యువరత్న అవార్డుల ప్రధానం చేశారు అవార్డు గ్రహీతలకు మెమెంటో తో పాటు శాలువా పూల మాలతో సత్కరించారు అనంతరం అవార్డులను అందజేశారు దళితులకు సంబంధించిన సమస్యలను గుర్తిస్తూ రాష్ట్ర స్థాయి ఉత్సవాల కమిటీ కన్వీనర్ గా ప్రకటించారు, నరేష్ కోవిడ్ విపత్కర సమయంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు అందించారని కొనియాడారు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ లో 18 రోజులపాటు రోజుకు 200 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం మరియు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో చురుగ్గా పాల్గొంటున్నట్లు దళిత రాష్ట్రస్థాయి వర్గాలు తెలిపాయి

దళిత యువ రత్న అవార్డుతో నా బాధ్యత ఇంకా పెరిగింది.
– బెస్త నరేష్.
నరేష్ మాట్లాడుతూ ఈ యొక్క అవార్డు రావడానికి మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బత్తుల రాంప్రసాద్ విశేషంగా కృషి చేసి నిజాయితీగా పనిచేసే వాళ్లను గుర్తించి అవార్డు రావడానికి కారణం అయ్యారు, అవార్డుతో మరింత తన బాధ్యత పెరిగిందని, ప్రతి ఒక్కరు నిజాయితీగా పనిచేస్తే గుర్తింపు మరియు అవార్డు సొంతం అవుతాయని తెలియజేశారు దళితులకు ఎల్లవేళలా అండగా ఉంటానని తెలియజేశారు. నా సేవలను గుర్తించిన తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ అధికారులు మరియు ఉత్సవాల కమిటీ చైర్మన్ రావుల విజయ్ కుమార్ మరియు నాగారం చినబాబు లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు

Oplus_131072
Oplus_131072
కొండ్లెపు జగదీశ్వర్ జర్నలిస్ట్ ఎల్లారెడ్డిపేట్