Breaking News

స్థానిక ఎన్నికల సన్నాహక సమావేశం – బిజెపి

14 Views

ఎలాంటి అడ్డంకులు లేకుండా బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ తోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి – రఘునాథ్ వెరబెల్లి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు.

మంచిర్యాల జిల్లా.

స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో ఈరోజు బీజేపీ మంచిర్యాల జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ అధ్యక్షతన జిల్లా నాయకులు మరియు మండల అధ్యక్షులతో ఎన్నికల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి గారు మరియు జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల ప్రభారి ఎడ్ల అశోక్ రెడ్డి పాల్గొనడం జరిగింది. అనంతరం పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ సందర్భంగా రఘునాథ్  మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బిసిలకు తీసుకవచ్చిన 42 శాతం రిజర్వేషన్లు ను బీజేపీ పార్టీ స్వాగతిస్తుంది కానీ కాంగ్రెస్ పార్టీ దగ్గరి వ్యక్తులు కోర్ట్ లో కేసులు వేసి ఎన్నికలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 42 శాతం రిజర్వేషన్ తోనే ఎన్నికలు నిర్వహించే లాగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి ఇప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రైతులకు పూర్తిగా రుణ మాఫీ చేయకుండా, రైతు భరోసా అందించకుండా మరియు యూరియా సకాలంలో అందించకుండా రైతులను మోసం చేసిందని అని అన్నారు. పెన్షన్ల పెంపు, మహిళలకు నెలకు 2500, కల్యాణలక్ష్మి కింద తులం బంగారం, విద్యార్థినులకు స్కూటీలు, నిరుద్యోగులకు నెలకు 4వేల రూపాయల నిరుద్యోగ భృతి వంటి అనేక హామీలు ఇచ్చి పేద ప్రజలకు మోసం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని అన్నారు. అదే విధంగా గత BRS ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసి గ్రామాల అభివృద్ధి చేయకుండా వదిలేశారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు BRS పార్టీకి లేదని అన్నారు. మరొక వైపు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి వేల కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేస్తుందని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని అన్ని స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు బీజేపీ పార్టీకి ఓటు వేసేయడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు ప్రకటించిన విధంగానే ఎన్నికల నిర్వహించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో కొయ్యల ఎమాజీ, గాజుల ముఖేష్ గౌడ్, ముత్తె సత్తయ్య, కమలాకర్ రావు, పట్టి వెంకట కృష్ణ, జోగుల శ్రీదేవి, అక్కల రమేష్, వంగపల్లి వెంకటేశ్వర్ రావు, ఎనగందుల కృష్ణ మూర్తి, పులగం తిరుపతి, మంత్రి రామయ్య, బెడద సురేష్ నాగేశ్వర్ రావు, శైలేందర్ సింగ్ మరియు తదితరులు పాల్గొన్నారు

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *