రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాలమేరకు సైబర్ నేరాలు పై అవగాహన గురించి ప్రతి నెల మొదటి బుధవారం రోజున సైబర్ జాగౄక్త దివాస్ అనే ప్రత్యేక కార్యక్రమం జిల్లా లోని అన్ని పోలీస్ స్టేషన్లో పరిధిలో వివిధ పాఠశాలల్లో ఉన్న విద్యార్థులకు, యువతకు, ప్రజలకు సైబర్ భద్రత, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.
సైబర్ జాగౄక్త దివాస్ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు జిల్లా సైబర్ సెల్ డిఎస్పీ ఆధ్వర్యంలో పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో మరియు అన్ని పోలీస్ స్టేషన్స్ పరిధిలో సైబర్ క్రైమ్ మీద విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది.
