రాష్ట్ర శాసన సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు జిల్లా యంత్రాంగానికి సహకరించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ అనురాగ్ జయంతి కోరారు.
బుధవారం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్ తో కలిసి కలెక్టరేట్ లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి నామినేషన్ల ప్రక్రియ, ఎన్నికల నిర్వహణ, ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలు, ఖర్చుల రిజిస్టర్ ల నిర్వహణ, తదితరాలపై అవగాహన కల్పించారు.
