నవంబర్ 1 కాళ్ళకల్
టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కాన్వాయ్ ని పోలీసులు బుధవారం తనిఖీ చేశారు. పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి హైదరాబాద్ నుంచి కామారెడ్డికి వెళ్తున్న క్రమంలో మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్ళకల్ లో ఏర్పాటుచేసిన చెక్ పోస్ట్ వద్ద మంత్రి వాహనాన్ని ఎన్నికల విధి నిర్వహణలో భాగంగా పోలీసులు తనిఖీ చేశారు.
