ముఖ్య కార్యకర్తల సమావే శంలో జడ్పీ చైర్ పర్సన్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి
ఏటూరునాగారం,సెప్టెంబర్ 04
రానున్న అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ శ్రేణులు గెలుపే ద్యేయంగా ముందుకు సాగాలని ములుగు జడ్పీ చైర్ పర్సన్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగ జ్యోతి పార్టీ శ్రేణులకు పిలుపుని చ్చారు.సోమవారం ఏటూరు నాగారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏటూరు నాగారం,కన్నాయిగూడెం మండలాల ముఖ్య కార్యక ర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈసందర్బంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల కోసం ఎన్నో బృహత్తరమైన సంక్షేమ పథకాలను ప్రజల ముందుకు తీసుకుని వచ్చిం దని ఎటువంటి సంక్షేమ రాజ్యం దేశంలో మరే రాష్ట్రంలోలేదని, ఇటువంటి సంక్షేమ ఫలాల గురించి ప్రజలకు పూర్తి స్థాయి లో వివరించడంలో పార్టీ శ్రేణులు వారధులుగా ఉండా లని అభ్యర్థి గెలుపు కోసం శక్తి వంచన లేకుండా కృషి చేయా లని ఆమె పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేసారు.ఈ కార్య క్రమంలో ఏటూరునాగారం మండల అధ్యక్షుడు,ములుగు మండల అధ్యక్షుడు గడదాసు సునిల్,బాదం ప్రవీణ్,ఎంపిపి అంతటి విజయ,రైతు బందుసమితి జిల్లా అద్యక్షుడు పల్లా బుచ్చయ్య,ఖాజా పాషా, చిన్ని కృష్ణ,మల్లారెడ్డి,మాదరి రామన్న,రాంబాబు,రాజేష్, పాల్గొన్నారు. 




