ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి అక్టోబర్ 31, సిరిసిల్ల నుండి బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవిగౌడ్ బిఆర్ఎస్ పార్టీలోకి చేరిన హైదరాబాద్ తెలంగాణ భవన్లో మున్సిపల్ శాఖ మంత్రి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరారు. రవిగౌడ్ తో పాటు బిసి విద్యార్థి సంఘ నాయకులు ఇల్లందుల ప్రకాష్, మట్టి శ్రీనివాస్, రుద్రవీణ,సుజిత్, మట్టి తిరుపతి,ఇల్లందుల ప్రణీత్,జగన్,బిట్టు,రాజు,నరేష్ గులాబీ గూటికి చేరారు. ఈకార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, మున్సిపల్ వైస్ చైర్మన్ మంచే శ్రీనివాస్, ముస్తాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కరాజ్ శ్రీనివాస్, కత్తెర వరుణ్ తదితరులు ఉన్నారు.
